T.Highcourt: ఆలేరు ఎమ్మెల్యేకు తెలంగాణ హైకోర్టు జరిమానా
ABN , First Publish Date - 2023-09-26T11:48:50+05:30 IST
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటీషన్‌లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు.
హైదరాబాద్: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి (Aleru MLA Gongidi Sunita Mahender Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) రూ.10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. 2018కి చెందిన కేసులో ఇప్పటి వరకూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గొంగిడి సునీతకు 10 వేల రూపాయల జరిమానా న్యాయస్థానం విధించింది. అక్టోబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు హైకోర్టు వాయిదా వేసింది. గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.