Trump's Reciprocal Tariffs: కొత్త అవకాశాలను అధ్యయనం చేస్తున్నాం: భారత్
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:47 PM
Trump's Reciprocal Tariffs: అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్.. సుంకాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు సైతం ఆయన సుంకం విధించారు. ఈ నేపథ్యంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సుంకాల వల్ల ఎదురయ్యే చిక్కులపై అధ్యయనం చేస్తున్నామని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 03: అమెరికా దేశాధ్యక్షుడిగా పాలన పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పరస్పర సుంకాలు విధిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ అంశంపై భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన 27 శాతం సుంకాల వల్ల ఎదురయ్యే చిక్కులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. అలాగే అమెరికా కొత్త వాణిజ్య విధానంలోని అభివృద్ధి కారణంగా తలెత్తే కొత్త అవకాశాలను సైతం అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. వికసిత భారత్‌ను దృష్టిలో పెట్టుకొని.. దేశంలోని పరిశ్రమలు, ఎగుమతిదారులతో సహా వాటాదారులతో చర్చలు జరుపుతూన్నామని వివరించింది. అలాగే సుంకాల అంచనాలతోపాటు ఎదురయ్యే పరిస్థితులను సైతం అంచనా వేస్తున్నామని పేర్కొంది.
అమెరికా కొత్త వాణిజ్య విధానం వ్లల్ల కలిగే అవకాశాలను సైతం అధ్యయనం చేస్తుందని తెలిపింది. ఇక అమెరికా అధ్యక్షుడు అన్ని వాణిజ్య భాగస్వాముల నుంచి దిగుమతులపై 10 నుంచి 50 శాతం వరకు అదనపు విలువలకు తగ్గట్లుగా సుంకాలు విధిస్తూ పరస్పర సుంకాలపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని వాణిజ్యం, పరిశ్రల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025, ఏప్రిల్ 5వ తేదీ నుంచి 10 శాతం బేస్ లైన్ సుంకం అమల్లోకి వస్తుందంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి అదనపు విలువలకు తగ్గట్లు విధుల సుంకం అమల్లోకి రానుందని పేర్కొంది.
భారత్ నుంచి దిగుమతులపై 27 శాతం సుంకాన్ని యూఎస్ దేశాధ్యక్షుడు ట్రంప్ విధించారు. అలాగే యూరోపియన్ యూనియన్‌కు 20 శాతం, జపాన్‌కు 24 శాతంతోపాటు దక్షిన కొరియాకు 25 శాతం సుంకం విధించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన స్నహితుడని తెలిపారు. తమతో ఆయన సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. వాళ్లు మా నుంచి 52 శాతం సుంకం వసూల్ చేస్తున్నారన్నాని చెప్పిన సంగతి తెలిసిందే.