Bhattivikramarka: కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు
ABN , First Publish Date - 2023-09-12T15:17:39+05:30 IST
ఈనెల 17వ తేదీన జరగనున్న CWC సమావేశం(CWC meeting) చరిత్రలో నిలచిపోతుందని కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క (Bhattivikramarka) వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా: ఈనెల 17వ తేదీన జరగనున్న CWC సమావేశం(CWC meeting) చరిత్రలో నిలచిపోతుందని కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క (Bhattivikramarka) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భట్టి మాట్లాడుతూ..హైదరాబాద్‌లో CWC సమావేశాలు నిర్వహించడం గర్వంగా ఉంది.తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహూల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు.కేసీఆర్(KCR) పాలనలో రాష్ట్రం అప్పులపాలయింది.తెలంగాణలో వనరులు సంపద దోపిడీకి గురయ్యాయి. దొరల చేతుల్లోకి ప్రభుత్వ ఆస్తులు వెళ్లిపోయాయి.చారిత్రక డిక్లరేషన్స్ సానియా గాంధీ ప్రకటించబోతున్నారు. నియోజకవర్గాలల్లో ఇంటింటికీ కాంగ్రెస్ నాయకులు గ్యారంటీ కార్డులు అందజేస్తారు. 17వ తేదీన జరుగనున్న సీడబ్లూసీ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలిరావాలని భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు.