Palla Rajeshwar Reddy: మోడీ సర్కార్ ఆ ఆలోచన విరమించుకోవాలి
ABN , First Publish Date - 2023-01-25T15:09:04+05:30 IST
రైతులపై పన్నుల భారం వేయొద్దని బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోడీ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ రైతుల మీద
హైదరాబాద్: రైతులపై పన్నుల భారం వేయొద్దని బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోడీ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ రైతుల మీద పన్ను వేయాలని ఆర్టికల్ రాశారు. బ్రిటిష్ కాలం (British period)లో పన్నులు వేశారని చెబుతున్నారు. ఇది మోడీ మన్ కీ బాత్ (Mann Ki Baat)గా మేము భావిస్తున్నాం. స్వాతంత్ర్యానికి ముందు తర్వాత ఏ ప్రభుత్వం రైతుల మీద పన్ను కోసం చట్టం తేలేదు. మోడీ ప్రభుత్వం (Modi Govt.) పన్ను వేయాలనే ఆలోచన చేయడం విరమించుకోవాలి. రైతులకు భూమి మీద ఆదాయం తగ్గింది. మోడీ చెప్పినట్లు ఆదాయం డబుల్ కాలేదు. రైతులకు పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టో (Manifesto)లో పెట్టారు కానీ ఇవ్వలేదు. రైతులకు వ్యయం పెరిగింది. ఎంఎస్పీ ఆ స్థాయిలో పెరగలేదు. రైతుల (Farmers)కు వచ్చే ఆదాయం మీద పన్ను వేయాలనే ఆలోచన దుర్మార్గం. రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని ఉచిత సలహా అవసరం లేదు. ఇలాంటి సలహాలు ఇస్తున్న చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి.’’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.