Share News

CM Revanth Reddy: డిసెంబర్ మిరాకిల్.. నేను చెప్పినట్లుగానే తెలంగాణలో అద్భుతం జరిగింది

ABN , Publish Date - Dec 22 , 2023 | 10:06 PM

ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్న సచివాలయ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy )పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వరంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్టమస్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికారులు, హాజరయ్యారు. చిన్నారులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఏసు క్రీస్తు ఆశీర్వాదం ఉండాలని బిషప్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

CM Revanth Reddy: డిసెంబర్ మిరాకిల్.. నేను చెప్పినట్లుగానే తెలంగాణలో అద్భుతం జరిగింది

హైదరాబాద్: ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్న సచివాలయ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy )పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వరంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్టమస్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికారులు, హాజరయ్యారు. చిన్నారులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఏసు క్రీస్తు ఆశీర్వాదం ఉండాలని బిషప్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త ప్రభుత్వానికి క్రిస్టియన్ మత పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘డిసెంబర్‌లో తెలంగాణలో మిరాకిల్ జరుగుతుందని నేను ముందే చెప్పాను. ప్రపంచానికి డిసెంబర్ మిరాకిల్ నెల. చెప్పినట్టుగానే డిసెంబర్‌లో తెలంగాణలో అద్భుతం జరిగింది. క్రైస్తవులు, మైనార్టీలు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకోని తీసుకొచ్చారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం రావడానికి ఏంతో కృషి చేశారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా , తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకోవాలి. దేశంలో మణిపూర్ సంఘటన ప్రస్తుత బీజేపీ వైఖరీని తెలియజేస్తుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సామాన్యులకు ఎప్పుడు దూరంగా లేను. గతంలో గడీల పాలనా మాదిరిగా కొత్త ప్రభుత్వంలో ఉండదు. ప్రజావాణిలో మీకున్న ఇబ్బందులను తెలియజేయవచ్చు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Dec 22 , 2023 | 11:32 PM