Lakshman: చేతివృత్తుల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి

ABN , First Publish Date - 2023-09-15T18:11:52+05:30 IST

చేతివృత్తుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(pm modi) విశేష కృషి చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్(Lakshman) వ్యాఖ్యానించారు.

Lakshman: చేతివృత్తుల సంక్షేమానికి ప్రధాని మోదీ కృషి

హైదరాబాద్: చేతివృత్తుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(pm modi) విశేష కృషి చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్(Lakshman) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కుల, చేతి వృత్తులు వర్గాలను విస్మరించి కనీస శ్రద్ధ చూపలేదు. నైపుణ్యతన ఆసరాగా అనాదిగా చేతివృత్తుల వారు వృత్తిలో కొనసాగుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, చేతివృత్తుల మీదనే ఆధారపడి ఉంది. వారు భూములు కోల్పోయారు. వారు దుర్భరమైన జీవితంతో నెట్టుకొస్తున్నారు.

చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించి, ఆధునిక పరికరాలు అందించే యోజనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. ప్రధాని పుట్టినరోజు, విశ్వకర్మ జయంతి సందర్భంగా అనేక వృత్తుల్లో ఉన్నవారికి ‘‘ప్రధాని విశ్వకర్మ యోజన’’ జీవితాలల్లో వెలుగు నింపుతుంది. ఈ పథకం 30 లక్షల మందికి ఉపయోగపడుతుంది. ఈ పథకంలో 140 జాతుల 18 వృత్తులు వారు లబ్ధి పొందుతారు. రేపు 119 అసెంబ్లీ కేంద్రాల్లో బైక్ ర్యాలీ చేసి విశ్వకర్మ పథకాన్ని ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటే బాగుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు KVIC , MSME లాంటివి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ లబ్ధిదారులకు అండగా ఉంటాయని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-15T18:11:58+05:30 IST