పంజాగుట్ట ఏసీపీగా మోహన్ కుమార్
ABN , First Publish Date - 2023-02-02T00:45:10+05:30 IST
పంజాగుట్ట, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పంజాగుట్ట డివిజన్ శాంతి భద్రతల విభాగం ఏసీపీగా ఎస్.మోహన్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.

పంజాగుట్ట, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పంజాగుట్ట డివిజన్ శాంతి భద్రతల విభాగం ఏసీపీగా ఎస్.మోహన్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. ఇప్పటి వరకు ఇక్కడ ఏసీపీగా విధులు నిర్వహించిన పీవీ.గణేష్ ఖమ్మం ఏసీపీగా బదిలీ అయ్యారు. సీసీఎ్‌సలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మోహన్ కుమార్ పంజాగుట్ట ఏసీపీగా వచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన 1995లో పోలీస్ శాఖలో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. పంజాగుట్ట పీఎ్‌సలో మూడు సంవత్సరాల పాటు ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడే పీఎస్ ఆధునికీకరణ ప్రారంభమైంది. దేశంలో రెండో అత్యున్నత పీఎస్ గా నిలవడానికి ఆయన చేపట్టిన చర్యలే కారణమయ్యాయి. బదిలీ అయిన ఏసీపీ పీవీ.గణేష్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఐ దుర్గారావు, ఎస్‌ఐలు విజయభాస్కర్ రెడ్డి, నరేష్, రఫీయుద్దీన్, ఎస్‌ఆర్ నగర్ ఇన్‌స్పెక్టర్ కె.సైదులు, డీఐ రాంప్రసాద్‌రావు, ఎస్‌ఐలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.