Hyderabad: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఎంత ఘోరం జరిగిందో చూడండి..!

ABN , First Publish Date - 2023-05-25T13:05:20+05:30 IST

నీడగా ఉందని అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో పడుకోబెడితే.. చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హైదరాబాద్‌లోని హయత్ ‌నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఎంత ఘోరం జరిగిందో చూడండి..!

నిద్రిస్తున్న చిన్నారి పైకి కారు.. దుర్మరణం

అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో ప్రమాదం

హయత్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి): నీడగా ఉందని అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో పడుకోబెడితే.. చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హయత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన కొడ్లి రాజు, కవితా దంపతులు బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉంటూ బిల్డింగ్‌ స్లాబ్‌ పనులు చేస్తుంటారు. బుధవారం హయత్‌నగర్‌ లెక్చరర్స్‌ కాలనీలో ఓ భవనానికి స్లాబ్‌ వేస్తున్నారు.

కవిత తన కుమార్తె లక్ష్మి(3)ని బాలాజీ ఆర్కెడ్‌ అపార్టుమెంట్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో పడుకోబెట్టింది. ఆర్కిటెక్చర్‌ హరిరాం తన కారును తీస్తూ చూసుకోకుండా చిన్నారిపై నుంచి తీసుకువెళ్లాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. తనకు న్యాయం చేయాలని చిన్నారి తల్లి బోరున విలపించింది.

Updated Date - 2023-05-25T14:37:31+05:30 IST