Gun Fire: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. అసలు ఏం జరిగిదంటే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 03:23 PM
Hyderabad gunfire incident: హైదరాబాద్‌లో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుడిమల్కాపూర్‌లోని ఓ ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

హైదరాబాద్: హైదరాబాద్‌లో శనివారం నాడు కాల్పులు కలకలం సృష్టించాయి. గుడి మల్కాపూర్‌లో గల కింగ్స్ ప్యాలెస్‌లోని ఆనం మీర్జా ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆనం మీర్జా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో వ్యాపారులు దుకాణాలు భారీగా ఏర్పాటు చేశారు. ఇద్దరు దుకాణాదారుల మధ్య ఓ విషయంలో వాగ్వాదం జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో ఒక షాప్ కీపర్ గాలిలో కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరగడంతో ఎక్స్‌పో చూడటానికి వచ్చిన సందర్శకులు అక్కడి నుంచి భయటకు పరుగులు తీశారు. కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం తెలియడంతో వెంటనే సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధరించారు. కాల్పుల ముందు అసలు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. కాల్పుల సంఘటనకు సబంధించి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాల్పులకు కారణమైన ఇద్దరు దుకాణాదారుల మధ్య పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Mallareddy controversy: మరోసారి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏకంగా హీరోయిన్‌పై..
Betting App Case: బెట్టింగ్ కేసు.. నేడు మరోసారి పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ
Phone Tapping Case: పోలీసుల ముందు శ్రవణ్ రావు.. అడిగిన ప్రశ్నలివే..
Read Latest Telangana News and Telugu News