TS News: జావదేకర్‌ వేములవాడ ఆలయాన్ని అపవిత్రం చేయలేదు... రాజరాజేశ్వరస్వామి ఆలయ అర్చకుడు

ABN , First Publish Date - 2023-06-12T17:08:49+05:30 IST

ఆదివారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం (Vemulawada Rajarajeswara Swamy Temple)లోకి కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ (Former Union Minister Prakash Javadekar) బూట్లు వేసుకుని వచ్చారని ప్రచారం జరిగింది.

TS News: జావదేకర్‌ వేములవాడ ఆలయాన్ని అపవిత్రం చేయలేదు... రాజరాజేశ్వరస్వామి ఆలయ అర్చకుడు

వేములవాడ: ఆదివారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం (Vemulawada Rajarajeswara Swamy Temple)లోకి కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ (Former Union Minister Prakash Javadekar) బూట్లు వేసుకుని వచ్చారని ప్రచారం జరిగింది. ఆయన బూట్లు వేసుకుని స్వామి వారిని దర్శించుకుని అపవిత్రం చేశారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రచారాన్ని ఆలయ అర్చకులు ఒకరు ఖడించాడు. జావదేకర్‌ ఆలయంలోకి బూట్లతో రాలేదని సాక్షులు వేసుకుని వచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన సాక్షులు తడిచి కాలు జారీ కిందపడబోయాడని, ఈ సమయంలో అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది ఆయనను పట్టుకున్నారని తెలిపారు. తర్వాత ఆయన సాక్షులు కూడా తీసేశారని అర్చకుడు పేర్కొన్నారు. కానీ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం అత్యంత ప్రవిత్రమైన క్షేత్రమని అర్చకుడు వివరించారు.

Updated Date - 2023-06-12T17:13:25+05:30 IST