వైభవంగా వసంత పంచమి వేడుకలు
ABN , First Publish Date - 2023-01-27T00:30:14+05:30 IST
వసంత పం చమి సందర్భంగా గురువారం గోదావరిఖ నిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమా లు వైభవంగా జరిగాయి.

కోల్‌సిటీటౌన్, జనవరి 26: వసంత పం చమి సందర్భంగా గురువారం గోదావరిఖ నిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమా లు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే కోరు కంటి చందర్ నేతృత్వంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పిల్లలకు అక్షరాభ్యాసం చేయిం చారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్, బీఆర్‌ఎస్ నాయకు రాలు మూల విజయారెడ్డి, సీడీపీవో పుష్ప లత, విజయమ్మ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎడెల్లి శ్యాం, కార్పొరేటర్లు, నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. స్థానిక 12వ డివిజన్‌లో కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రం లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిం చారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు భారతి, సుజాత, రాజేశ్వరి తదితరు లు పాల్గొన్నారు.