Bhatti Vikramarka: తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసం.. దొరల కోసం కాదు..

ABN , First Publish Date - 2023-10-11T16:03:31+05:30 IST

ఖమ్మం జిల్లా: తెలంగాణ ప్రజలు దోపిడీ ప్రభుత్వంను వదిలించుకొని ఇందిరా పాలన కోసం ఎదురు చూస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసం.. దొరల కోసం కాదు..

ఖమ్మం జిల్లా: తెలంగాణ ప్రజలు (Telangana People) దోపిడీ ప్రభుత్వంను వదిలించుకొని ఇందిరా పాలన కోసం ఎదురు చూస్తున్నారని సీఎల్పీ నేత (CLP Leader) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఖమ్మం జిల్లా అనంతసాగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను (Congress party candidates) భారీ మెజార్టీతో గెలిపించుకుని ప్రభుత్వంను ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ప్రజల కోసమని.. దొరల కోసం కాదని అన్నారు. బీఆర్‌ఎస్‌ (BRS)కు ఓటు వేయడమంటే బీజేపీ (BJP)కి ఓటు వేసినట్లేనని, బీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని ఆయన ఆరోపించారు.

ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని, రాబోయేది కాంగ్రెస్ ప్రభత్వమేనని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంను ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నడుస్తోందని, వామపక్ష పార్టీలతో పొత్తుల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. కొన్ని పత్రికలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భట్టి విక్రమార్క విమర్శించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-10-11T16:03:31+05:30 IST