గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు
ABN , First Publish Date - 2023-01-26T22:48:36+05:30 IST
మండల పరిధిలోని చొప్పాల పంచాయితీలోని రంగాపురం ప్రధాన రహదారి పక్కన గుట్టపై కొలువు తీరిన సారలమ్మ జాతర మహోత్సవం సందర్భంగా గురువారం వనం నుంచి వనదేవతలను గద్దెలపై పూజారులు కొలువు తీర్చారు.

కరకగూడెం, జనవరి 26: మండల పరిధిలోని చొప్పాల పంచాయితీలోని రంగాపురం ప్రధాన రహదారి పక్కన గుట్టపై కొలువు తీరిన సారలమ్మ జాతర మహోత్సవం సందర్భంగా గురువారం వనం నుంచి వనదేవతలను గద్దెలపై పూజారులు కొలువు తీర్చారు. గురువారం నిండు జాతర సందర్భంగా 12.30 గంటలకు గుట్ట నుంచి వనదేవలను తీసుక వస్తుండగా.. మార్గం మధ్యలో వనదేవతలకు, సారలమ్మ ఎదురుకోలు నిర్వహించారు. అనంతరం వనదేవతను గిరిజన సంప్రదాయాలు, నృత్యాలు, మేళతాళాలతో జన సంద్రంలో, పూనకాలతో సారలమ్మ ఆలయం వద్ద గద్దెలపై భక్తి శ్రద్ధలతో కొలువు తీర్చారు. వనదేవతలను గద్దెల వద్దకు తీసుకొస్తున్న క్రమంలో మహిళలు బిందెలతో నీరు ఆరపోసి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెలపై కొలువుతీరిన వనదేవతలను భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.