మిర్చి పంటపై నల్లి దాడి
ABN , First Publish Date - 2023-01-27T22:48:04+05:30 IST
మిర్చి పంటపై నల్లి పురుగు దాడి చేస్తోంది. పంట చేతికి వస్తున్న తరుణంలో పంటలు దెబ్బతింటుండడంతో రైతులు లబోదిబో మంటున్నారు.
చర్ల, జనవరి 27: మిర్చి పంటపై నల్లి పురుగు దాడి చేస్తోంది. పంట చేతికి వస్తున్న తరుణంలో పంటలు దెబ్బతింటుండడంతో రైతులు లబోదిబో మంటున్నారు. పెట్టిన పెట్టుబడులు అయినా వస్తాయో లేదో అని కన్నీరు పెడుతున్నారు. నల్లి నొవారణకు నివారణకు వ్యవసాయశాఖ, ఉద్యానవణ శాఖ అధికారులు రైతులకు సూచనలు సలహాలు అందించాలని రైతులు కోరుతున్నారు. చర్ల మండలంలో ఈడాది సుమారు 15 వేల ఎకలాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. ప్రతీ ఎకరాకు సుమారు లక్షన్నర ఖర్చు చేశారు. ప్రస్తుతం పంట కాపు దశలో ఉంది. కొన్ని చోట్ల మొదటి క్రాఫ్ జరుగుతోంది. కాగా పంట చేతికి వస్తున్న తరుణంలో మొక్కలపై నల్లి పురుగు దాడి చేస్తోంది. మొగళ్ళపల్లి, లింగాపురం, వీరాపురం, కొత్తపల్లి, చర్ల, సుబ్బంపేట, కొయ్యూరు, మిడిసిలేరు, ఆర్‌కొత్తగూడెం, సత్యనారాయణ పురం ఇతర గ్రామాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. నల్లి దాడితో పంట ఎదుగు దల ఉండదని, దిగుబడి కూడా తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. కాగా గత రెండు సంవత్సరాలుగా రైతులు తెగుళ్ళుదాడితో నష్ట పోయారు. నేడు పంటలపై నల్లి దాడి చేస్తుండంతో ఈ ఏడాదికూడా నష్టాలు తప్పవని రైతులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు కనీస సూచనలు అయినా అధించాలని కోరుతున్నారు.