Renuka Choudary: తెలంగాణలో బీజేపీ అడ్రెస్ లేదు..

ABN , First Publish Date - 2023-07-09T14:05:25+05:30 IST

ఖమ్మం జిల్లా: సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని, తెలంగాణలో బీజేపీ అడ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అన్నారు.

Renuka Choudary: తెలంగాణలో బీజేపీ అడ్రెస్ లేదు..

ఖమ్మం జిల్లా: సీఎం కేసీఆర్ (CM KCR), ప్రధాని మోదీ (PM Modi) ఇద్దరూ ఒక్కటేనని, తెలంగాణలో బీజేపీ (BJP) అడ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి (Renuka Choudary) అన్నారు. ఆదివారం ఆమె ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (Congress Office)లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతోందన్నారు. నార్త్‌లో వంద సీట్లకుపైగా బీజేపీ కోల్పోబోతోందన్నారు. బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతతత్వ రాజకీయాలకు ఈ దేశంలో చోటు లేదన్నారు.

పార్లమెంట్‌లో అసభ్యంగా.. అసహ్యంగా ప్రధాని మోదీ అబద్దాలు చెబుతున్నారని రేణుక చౌదరి అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్, కేసీఆర్‌ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. మంత్రి హరీష్ రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. కాంగ్రెస్ గంగా నది లాంటిదని, ఇందులోకి ఎంతో మంది వచ్చి స్నానం చేసి పునీతులవుతున్నారని అన్నారు. సర్వే నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని రేణుక చౌదరి పేర్కొన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-09T14:05:25+05:30 IST