క్రీడల్లో రాణించి పతకాలు సాధించాలి
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:12 PM
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించాలని జిల్లా పరిషత్ ముఖ్య కా ర్యనిర్వహణ అధికారి ఉష అన్నారు.

- జడ్పీ సీఈవో ఉష
- జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెంబరు 22: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించాలని జిల్లా పరిషత్ ముఖ్య కా ర్యనిర్వహణ అధికారి ఉష అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానం లో జిల్లా షెడ్యూలు కులాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ వసతి గృహాల బాల బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమానికి జడ్పీ సీఈవో ఉష హాజరై విజేతలకు షీల్డులు అందజేశారు. కబడ్డీ బాలుర విభాగంలో ప్రథమ బహుమతి కొల్లాపూర్, ద్వితీయ బహుమతి కల్వకుర్తి, బాలికల విభాగంలో ప్రథమ బహుమతి అచ్చంపేట, ద్వితీయ బహుమతి కల్వకుర్తి జట్ల క్రీడాకారులు అందుకున్నారు. అదేవిధంగా వాలీబాల్ బాలుర విభాగంలో అచ్చంపేట ప్రథమ బహుమతి గెలుచుకోగా నాగర్‌కర్నూల్ ద్వితీయ బహుమతి అందుకున్నారు. ఖోఖోలో బాలికల విభాగంలో నాగర్‌కర్నూల్ ప్రథమ, అచ్చంపేట ద్వితీయ బహుమతులు అందుకున్నారు. రన్నింగ్‌లో బాలుర విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ వరుసగా విశ్వవిరాట్- నాగర్‌కర్నూల్, గణేష్- బిజినేపల్లి, పవన్- బిజినేప ల్లి అందుకున్నారు. అలాగే బాలికల రన్నింగ్‌లో నాగర్‌కర్నూల్ విద్యార్థులు నందిని, ఇందు, మీనా వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నా రు. జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రాంలాల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీధర్‌జీ, సూపరింటెండెంట్ రాంజీ, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు, వార్డెన్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.