Mutyamdhara Waterfalls: ముత్యందార జలపాతంలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులు
ABN , First Publish Date - 2023-07-26T22:41:57+05:30 IST
వెంకటాపురం (Venkatapuram) మండలంలోని ముత్యందార జలపాతంలో (Mutyamdhara waterfalls) 50 నుంచి 70 మంది పర్యాటకులు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ములుగు జిల్లా: వెంకటాపురం (Venkatapuram) మండలంలోని ముత్యందార జలపాతంలో (Mutyamdhara waterfalls) 84 పర్యాటకులు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యాటకుల సంఖ్యపై అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. 15 కార్లు, 10 బైకులు వీరభద్రవరం దగ్గర వదిలి నడక మార్గాన పర్యాటకులు ముత్యందార జలపాతం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. 700 అడుగుల ఎత్తు నుంచి జలపాతం కిందకు వస్తోంది.
వారి వాహనాల సంఖ్యను బట్టి పర్యాటకులు ఎంతమంది ఉన్నారనేది అధికారులు అంచనా వేస్తున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జలపాతం చూడడానికి వెళ్లి పర్యాటకులు చిక్కుకున్నారు. మధ్యలో వాగు పొంగడంతో తిరిగిరాలేక పర్యాటకులు అక్కడే ఆహా కారాలు చేస్తున్నారు. వెంకటాపురం వీరభద్రవరం గుట్టల్లో ముత్యందార జలపాతం ఉంది. పర్యాటకులు కాలినడకన వెళ్లి చిక్కుకున్నట్లు తెలుస్తోంది.