Telangana Rains : తెలంగాణలో విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు.. శనివారం సంగతేంటంటే..!
ABN , First Publish Date - 2023-07-27T13:04:16+05:30 IST
తెలంగాణలో (Telangana) వద్దంటే వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా హైదరాబాద్‌తో (Hyderabad) పాటు పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షాల నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది...
తెలంగాణలో (Telangana) వద్దంటే వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా హైదరాబాద్‌తో (Hyderabad) పాటు పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షాల నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు (TS Schools) శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం విద్యాశాఖ ఉన్నతాధికారులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (Minister Sabitha Indra Reddy) సీఎం కేసీఆర్ (CM KCR) సమీక్ష నిర్వహించారు. మరో రెండ్రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే శనివారం మొహర్రం, ఆ తర్వాత ఆదివారం ఇలా విద్యా సంస్థలకు వరుసగా సెలవులు వచ్చాయి.
వరుసగా సెలవులు..
కాగా.. ఇప్పటికే బుధ, గురువారాలు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సెలవులు మరో రోజు పొడిగించడం జరిగింది. దీంతో బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఆ తర్వాత ఆదివారం ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చినట్లయ్యింది. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కాస్త ఊపిరిపీల్చుకున్నట్లయ్యింది. ఇదిలా ఉంటే.. మరో మూడ్రోజుల పాటు భారీగానే వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో రెడ్ అలర్ట్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.