గ్యాస్ సిలిండర్ల లీకేజీలతో అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2023-04-22T00:16:40+05:30 IST
ఇళ్లలో వంట గ్యాస్ సిలిండర్ల లీకేజీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌన్సిలర్ విజయదేవిరంగారావు సూచించారు.

తాండూరు, ఏప్రిల్ 21: ఇళ్లలో వంట గ్యాస్ సిలిండర్ల లీకేజీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌన్సిలర్ విజయదేవిరంగారావు సూచించారు. శుక్రవారం తాండూరు 28వ వార్డులో అగ్నిపమాక శాఖ అధికారి నాగార్జున ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం సంభిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ అధికారి, సిబ్బంది అవగాహన కల్పించారు. ఫైర్ ఆఫీసర్ నాగార్జున మాట్లాడుతూ.. ఎల్పీజీ లీక్ అయితే వాసన వస్తుందని, ఆ సమయంలో ఎక్కడా లైట్లు వేయడం, అగ్గిపుల్ల వెలిగించడం, లైటర్ కొట్టడం వంటివి చేయొద్దన్నారు. వెంటనే డోర్లు, కిటికీలు తెరవాలన్నారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నార ు.