వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-03-07T23:26:48+05:30 IST
దేవుని పడకల్‌లోని లక్ష్మీ అలవేలుమంగ గోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
తలకొండపల్లి, మార్చి7: దేవుని పడకల్‌లోని లక్ష్మీ అలవేలుమంగ గోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాల కొనసాగుతాయి. ధర్మకర్త రాజ్‌కుమార్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్‌రావు, సర్పంచ్ శ్రీశైలం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్చకులు రామాచార్యులు, గోపాలచార్యులు, శ్రీనివాసచార్యులు, చక్రవర్తి చార్యులు, కిరణ్ తొలిరోజు ధ్వజారోహణ పూజలు, భేరి పూజ, హోమం, బలిహరణం, సింహవాహన సేవ, తదితర పూజలను నిర్వహించారు. మూల విరాట్లను పట్టు వస్త్రాలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు మధుకుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్, ఆంజనేయులు, అంజయ్య, భానుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కల్కిదోన వేణుగోపాలస్వామి పల్లకీసేవ
తలకొండపల్లి: చుక్కాపూర్‌లో గల కల్కిదోన గుట్టపై వెలసిన వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. స్వామి వారికి పల్లకీ సేవతో ఉత్సవాలను ముగించారు. వారం పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. ముగింపులో భాగంగా ఆలయ ఫౌండర్ ట్రస్టీ పట్టాభిరామశర్మ, ప్రధానార్చకుడు కృష్ణమూర్తి చక్రతీర్థం, మంగళస్నానం పూజల అనంతరం స్వామి వారలకు పల్లకీసేవ నిర్వహించారు. పూజాకార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌లు స్వప్నభాస్కర్‌రెడ్డి, కిష్టమ్మ, మాజీ ఎంపీటీసీ యాదయ్య, ఉపసర్పంచ్ శ్రీనివా్‌సరెడ్డి, శ్యామ్‌సుందర్, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.