దీక్ష విరమించిన మహారాష్ట్ర రైతులు

ABN , First Publish Date - 2023-06-08T00:36:39+05:30 IST

మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో ముంపుకు గురవుతున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 26 నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టిన మహారాష్ట్ర రైతులు బుధవారం విరపించారు.

దీక్ష విరమించిన మహారాష్ట్ర రైతులు
రైతులతో దీక్ష విరమింపజేస్తున్న మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ శోభ ఫడణవీస్‌

మొదటి విడతలో 128 హెక్టార్లకు పరిహారం విడుదల

నిమ్మరసం ఇచ్చిన చంద్రాపూర్‌ మాజీ ఎమ్మెల్సీ శోభ ఫడణవీస్‌

మహదేవపూర్‌ రూరల్‌, జూన్‌ 7: మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో ముంపుకు గురవుతున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 26 నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టిన మహారాష్ట్ర రైతులు బుధవారం విరపించారు. బీజేపీ నాయకురాలు, చంద్రపూర్‌ మాజీ ఎమ్మొల్సీ శోభ పఢణ వీస్‌ నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. మహారాష్ట్ర ఉపముఖ్య మంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను రైతులు గత నెలకలిసి ముంపు సమస్యను వివరించారు. దీంతో స్పందించిన ఉపముఖ్యమంత్రి ముందుగా సర్వే చేసిన 128 హెక్టార్లతో పాటు అదనంగా ముంపునకు గురవుతున్న 500హెక్టార్ల భూమి ని సర్వే చేసి పరిహారం అందిలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటగా 128 హెక్టార్లకు మహారాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో దీక్షను విరమిస్తున్నట్టు మహారైతులు తెలిపారు. హామీని నిలబెట్టుకోలేని తెలంగాణ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు. రైతుల సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషిచేసిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-06-08T00:36:39+05:30 IST