Yadadri: 15రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే.. | What is the income of Yadadri Hundi in 15 days bbr

Yadadri: 15రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే..

ABN , First Publish Date - 2023-06-15T20:55:02+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు 15రోజుల్లో రూ.1.78కోట్ల హుండీ ఆదాయం లభించింది. నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన

Yadadri: 15రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే..

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు 15రోజుల్లో రూ.1.78కోట్ల హుండీ ఆదాయం లభించింది. నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను కొండకింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి పర్యవేక్షణలో గురువారం లెక్కించారు. గత నెల 31నుంచి ఈ నెల 14వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా వచ్చిన రూ.1.78కోట్లు, 86గ్రాముల మిశ్రమ బంగారం, 3.500గ్రాముల మిశ్రమ వెండి ఆలయ ఖజానాలో జమచేశారు. విదేశీ కరెన్సీ రూపంలో 664 అమెరికా డాలర్లు, 10ఆస్ట్రేలియా డాలర్లు, 70 కెనడా డాలర్లు, 6001/2 ఓమన్‌ బైంసాలు, ఒక కతార్‌ రియాల్‌, 25యూరప్‌ యూరోలు, ఒక బూటాన్‌ బూటానీస్‌ గుల్ట్రమ్‌, 100 సౌతాఫ్రికా రండ్స్‌, 1000 జపనీస్‌ యెన్‌లు, 10 నేపాల్‌ నేపాలీస్‌ రూపీ, 5000 సిరియా సిరియన్‌ పౌండ్స్‌ ఆలయ ఖజానాకు సమకూరాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.23,71,626ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఉప్పల సుభాష్‌ రూ.3.5లక్షల విలువైన రెండు వస్త్ర హుండీలను ఆలయానికి అందజేశారు.

Updated Date - 2023-06-15T20:55:02+05:30 IST