JAI HANUMAN : అనుగ్రహించు.. హనుమా..!
ABN , Publish Date - Jun 02 , 2024 | 12:48 AM
వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శనివారం దక్షిణాది హనుమద్ జయంత్యుత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రవచనాలు, హనుమాన చాలీసా పఠనాలను నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కసాపురం ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ...
వైభవోపేతంగా హనుమజ్జయంతి
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
కసాపురంలో శ్రీరామపట్టాభిషేకం
వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శనివారం దక్షిణాది హనుమద్ జయంత్యుత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ప్రవచనాలు, హనుమాన చాలీసా పఠనాలను నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కసాపురం ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయంలో నెట్టికంటి ఆయంజనేయ స్వామి మూల విరాట్టును అభిషేకించి.. వజ్ర ఖచిత స్వర్ణ వస్త్ర, కవచాలు, పుష్పాలతో, తోమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆలయ ఆరాధన, వేద, సుందరకాండ, మన్యుసూక్త పారాయణం చేశారు.
అనంతరం యాగశాలలో మన్యుసూక్త హోమం, శ్రీరామ ఆంజనేయ మూల మంత్రానుష్టానాలు చేపట్టారు. ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ సహిత లక్ష్మణ, ఆంజనేయుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. పట్టాభిషేకం సందర్భంగా బలిహరణ, పూర్ణాహుతి, కలశోద్వాసన, మహాదాశీర్వచన కార్యక్రమాలను చేపట్టారు. ఆలయంలో నైమిశారణ్య పీఠాధిపతి బాల బ్రహ్మానంద సరస్వతి ఆధ్వర్యంలో సుందరకాండ, హనుమద్వైభవంపై ప్రవచనాన్ని నిర్వహించారు. సాయంత్రం ఒంటె వాహనంపై స్వామివార్లకు ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలలో ఆలయ ఈఓ భద్రాజీ, ధర్మకర్తల మండలి చైర్‌పర్సన సుగుణమ్మ, సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
- అనంతపురం కల్చరల్, గుంతకల్లు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....