Share News

Sri Ram Navami శ్రీరామనవమి ప్రశాంతంగా జరుపుకోండి: ఎస్పీ

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:29 AM

శ్రీరామనవమి పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ వీ.రత్న సూచించారు.

Sri Ram Navami  శ్రీరామనవమి ప్రశాంతంగా జరుపుకోండి: ఎస్పీ
ఎండ్లబండి పోటీల ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ

పుట్టపర్తి రూరల్‌ ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ వీ.రత్న సూచించారు. శుక్రవారం మండలంలోని కరావులపల్లి తండా వద్వ శ్రీరామనవమి పర్వదిన వేడుకల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే ఎండ్లబండ పోటీలు నిర్వహించే ప్రదేశాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరావులపల్లిలో ఎండ్లబండి పోటీల నిర్వాహకులు సమస్యలు తలెత్తకుండా మందుస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రశాంతంగా పోటీలను నిర్వహించుకోవాలన్నారు. వేడుకలకు మహారాష్ట్ర మంత్రి సంజయ్‌రాథోడ్‌ హాజరవుతున్నారని, ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు సూ చించారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఆర్‌డీఎస్పీ శ్రీనివాసులు, స్పెషల్‌బ్రాంచ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, గోరంట్ల సీఐ శేఖర్‌ ఉన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:29 AM