HELP : వరద బాధితులకు సాయం | Aid to flood victims
Share News

HELP : వరద బాధితులకు సాయం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:31 AM

వరద బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో భారీగా విరాళాలు వచ్చాయి. కళ్యాణదుర్గం నుంచి విజయవాడకు మంగళవారం రాత్రి ఆరు లారీల్లో నిత్య వసర సరుకులను తరలించారు. వాటిని విజయవాడలో బుధవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 200 మంది వలంటీర్లు, టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ, కళ్యాణదుర్గం నాయకులు పంపిణీ చేశారు.

HELP :  వరద బాధితులకు సాయం
వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, సెప్టెంబరు 11 : వరద బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో భారీగా విరాళాలు వచ్చాయి. కళ్యాణదుర్గం నుంచి విజయవాడకు మంగళవారం రాత్రి ఆరు లారీల్లో నిత్య వసర సరుకులను తరలించారు. వాటిని విజయవాడలో బుధవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 200 మంది వలంటీర్లు, టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ, కళ్యాణదుర్గం నాయకులు పంపిణీ చేశారు. మొత్తం 17 టన్నుల బియ్యం, కందిపప్పు, చక్కెర 80 టన్నులు, చింతపండు 20 టన్నులు, టమోటా 100 టన్నులు, కూరగాయాలు 80 టన్నులు, దుప్పట్లు, దుస్తులు, వంటనూనె, బిస్కెట్లతో పాటు మరికొన్ని నిత్యావసర సరుకులు తీసుకెళ్లి పంపిణీ చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా విరాళం గా వచ్చిన రూ. 15 లక్షల నగదును వరద బాధితులకు అందజేసినట్లు తెలి పారు. ఎమ్మెల్యే దగ్గరుండి సరుకులను పంపిణీ చేయించారు. మరింత సా యం అందించేందుకు ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

కుందుర్పి: విజయవాడ వరద బాధితుల కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్ఫూర్తితో తెలుగు తమ్ముళ్లు వెల్లువలా సాయం అందించారు. మండల పరిధిలోని జంబగుంపల, కొలిమిపాలెం, అప్పాజీపాలెం, కెంచంపల్లి గ్రామాల నుంచి 21 క్వింటాళ్ల బియ్యం, రూ. 45 వేలకు పైగా నగదును బుధవారం సాయంత్రం కళ్యాణదుర్గం ప్రజావేదికలో అందజేశారు.

పామిడి : విజయవాడలోని వరద బాధితుల కోసం టీడీపీ మండల ఇనచార్జ్‌ గుమ్మనూరు ఈశ్వర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఆర్‌ రమేష్‌ నేతృత్వంలో తెలు గు తమ్ముళ్లు నిత్యవసర సరుకులు, దుస్తులను సేకరిస్తున్నారు. పట్టణంలోని పలువార్డులలో ఇంటింటికీ వెళ్లి బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షుడు అప్పన్నగారి కుమార్‌, నాయకులు నల్లబోతుల శ్రీనివాసులు, బొమ్మా మోహనకృష్ణ, సుంకప్ప, పట్రా శ్రీనివాసులు, శ్రీరాములు, టపాల్‌, షేక్షా, వెంకటరమణ, జగనగౌడ్‌, రఫీ, హరి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 12 , 2024 | 12:31 AM