Share News

AP Govt: గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా.. పరీక్ష ఎప్పుడంటే..

ABN , Publish Date - Nov 12 , 2024 | 08:58 PM

ఏపీపీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను చంద్రబాబు ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. అసలు అయితే ఈ పరీక్ష జనవరి 5వ తేదీన జరగాల్సి ఉంది. అయతే ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలంటూ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్.. సీఎం చంద్రబాబను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

AP Govt: గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా.. పరీక్ష ఎప్పుడంటే..

అమరావతి, నవంబర్ 12: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేసింది. ఈ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మెయిన్స్ పరీక్షను వాయిదా వేసిన ప్రభుత్వానికి నిరుద్యోగ జేఏసీ ధన్యవాదాలు తెలిపింది.

Also Read: CM Chandrababu: మహిళలకు నెలకు రూ.1500.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Also Read: Viral Video: గుర్రమెక్కిన పిల్లోడు.. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా..


ఈ సందర్బంగా సదరు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ మాట్లాడుతూ.. ఈ పరీక్షను ఒక నెల వాయిదా వేయాలని తాము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును సెక్రటేరియట్ లో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ విజ్ఞప్తి చేసిన కేవలం ఐదు రోజులకే సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Also Read: Attack on Collector: రౌడీయిజం, గుండాయిజం చేస్తే.. తాట తీస్తాం

Also Read: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

Also Read: కాబూలీ శనగలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షన నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. ఇది మంచి ప్రభుత్వమంటూ నిరుద్యోగ జేఏసీ ప్రకటన విడుదల చేసింది. అసలు అయితే.. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన జరగాల్సి ఉంది.

Also Read: Attack on Collector: వికారాబాద్ ఘటనపై ఏడీజీ కీలక నివేదిక


2025, జనవరి 5వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్‌సీ అక్టోబర్ 30వ తేదీన ప్రకటించింది. అయితే ఈ పరీక్షలు నెల రోజుల పాటు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


కానీ 4,04,037 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. దీంతో మెయిన్స్‌కు మొత్తం 92, 250 మందిని ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ 879 గ్రూప్ 2 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరో 8 నోటిఫికేషన్లను అందులో కలిపారు. దీంతో ఉద్యోగాల సంఖ్య 905కి పెరిగాయి.

Also Read: ఐఏఎస్ ప్రశాంత్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 09:06 PM