Bonda Uma: తెలంగాణ తరహాలోనే ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం
ABN , Publish Date - Mar 23 , 2024 | 06:20 PM
కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు టీడీపీ - జనసేన - బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్(Phones Tapping) చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆధారాలను బయట పెట్టారు.
అమరావతి: కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు టీడీపీ - జనసేన - బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్(Phones Tapping) చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆధారాలను బయట పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై బోండా ఉమ అభియోగాలు మోపారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ సీతారామాంజనేయులు నేతృత్వంలో ఫోన్ల ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని అన్నారు. గతంలో తాము ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాధ్ చెప్పారని అన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసినప్పుడే ఏపీ సీఎం జగన్ అదే తరహా సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని సంచలన కామెంట్స్ చేశారు.
Nellore: ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి జిమ్మిక్కులు.. బయటపడ్డ భారీ కుట్ర..!
తామిచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం) పార్టీ అభ్యర్థులతో ఓ వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు. ఆ సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారని చెప్పారు. విశ్వేశ్వరరావు అనే వ్యక్తి తమ సమావేశంలోకి ఎందుకు వచ్చారని నిలదీశారు. ఐజీ పంపితేనే వచ్చానని ఆ కానిస్టేబుల్ చెప్పారన్నారు. కేశినేని చిన్ని కదలికల మీద నిఘా పెట్టినట్టు తమ దగ్గర వివరాలు ఉన్నాయని అన్నారు. చిన్ని కదలికలపై నిఘా పెట్టి ఫోన్లను ట్యాప్ చేసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్లో ఎలా లభ్యమయ్యాయని బోండా ఉమ ప్రశ్నించారు.
Chandrababu: యుద్ధంలో గెలిచి తీరాలి.. శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం..
ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు నిర్దారణ అయింది: కేశినేని చిన్ని
తెలంగాణలో కూడా ఇదే తరహాలో ట్యాపింగ్ ప్రక్రియ చేపట్టారని తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు నిర్దారణ అయిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు..? అని ప్రశ్నించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పారు. పీఎస్సార్ ఆంజనేయులతో సహా ఫోన్ ట్యాపింగుకు పాల్పడిన వారిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ(YSRCP) నేతలు బరి తెగించారని మండిపడ్డారు. ప్రధాని మోదీ సభకు వచ్చినందుకు ఏకంగా హత్యలే చేసేశారని.. దాడులు వైసీపీకి ఓ లెక్కే కాదని కేశినేని చిన్ని అన్నారు.
ఇవి కూడా చదవండి
AP News: ఎన్నికల ప్రక్రియకు వలంటీర్లను దూరంగా ఉంచాలి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
Nara Bhuvanevvari: ఏపీని రౌడీ రాజ్యం పరిపాలిస్తుంది
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి