Share News

CM Chandrababu : వల్లభాయ్‌ పటేల్‌ గొప్ప నాయకుడు

ABN , Publish Date - Dec 16 , 2024 | 06:42 AM

దేశ ప్రయోజనాల విషయంలో ఎవరైనా సరే.. ఎలాంటి పరిస్థితులకూ లొంగకుండా ఉక్కు సంకల్పంతో

CM Chandrababu : వల్లభాయ్‌ పటేల్‌  గొప్ప నాయకుడు

  • సీఎం చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రయోజనాల విషయంలో ఎవరైనా సరే.. ఎలాంటి పరిస్థితులకూ లొంగకుండా ఉక్కు సంకల్పంతో ముందుకెళ్లాలని మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో పటేల్‌ చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉక్కుమనిషి వల్లభాయ్‌ పటేల్‌ బ్రిటీషు వారి మెడలు వంచి, ప్రజల మదిలో సర్దార్‌గా నిలిచిపోయారని మంత్రి నారా లోకేశ్‌ కొనియాడారు. పటేల్‌కు ‘ఎక్స్‌’ వేదికగా నివాళులర్పించారు.

Updated Date - Dec 16 , 2024 | 06:42 AM