Share News

YS Sharmila: ఇలానే ఉంటుందా రాజన్న పాలనా?... అధికార పార్టీ సిగ్గుపడాలి..

ABN , Publish Date - Apr 10 , 2024 | 12:55 PM

Andhrapradesh: అల్లూరు జిల్లాలోని రహదారి సౌకర్యం సరిగా లేక మరణించిన కుమారుడిని తండ్రి భుజాలపై వేసుకుని కొండలను దాటి 8 కిలోమీటర్లను నడిచి స్వస్థాలనికి వెళ్లిన ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. అధికార పార్టీపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

YS Sharmila: ఇలానే ఉంటుందా రాజన్న పాలనా?... అధికార పార్టీ సిగ్గుపడాలి..
APCC Chief YS sharmila Reddy

అమరావతి, ఏప్రిల్ 10: అల్లూరు జిల్లాలోని రహదారి సౌకర్యం సరిగా లేక మరణించిన కుమారుడిని తండ్రి భుజాలపై వేసుకుని కొండలను దాటి 8 కిలోమీటర్లను నడిచి స్వస్థాలనికి వెళ్లిన ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. అధికార పార్టీపై (YSRCP) షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వెయ్యండి అని అడిగేవాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలి. ఆరోగ్యశ్రీని అట్టకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్యం ఎలాగూ అందటంలేదు. కనీసం చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారంటే అధికార పార్టీ సిగ్గుపడాలి. మేము అదిచేసాం ఇది చేశాం అని డబ్బాలు కొట్టుకోవటం కాదు. పేదోడి కనీస అవసరాలు తీర్చలేని మీ ప్రభుత్వం ఎందుకు? మళ్లీ మీరు రాజన్న వారసులం అని చెప్పుకుంటారు? ఇలానే ఉంటుందా రాజన్న పాలనా? అందుకే చెబుతున్నాం ఓటు అనే ఆయుధంతో వీళ్లకు బుద్ది చెప్పండి’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..!


ఇదీ వార్త..

అల్లూరు జిల్లాలో హృదయవిదారకమైన ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన కొడుకును తండ్రి భుజంపై వేసుకు కొండలు దాటి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివాసి గిరిజన దంపతులు కొత్తయ్య, సీత అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ చిన్నకోనెల గ్రామంలో నివాసం ఉంటున్నారు. పొట్టకూటి కోసం దంపతులు గుంటూరులో ఇటుక బట్టీల పనులకు వెళ్తుంటారు. వీరికి ఇద్దరు కుమారు. చిన్న కుమారుడు ఈశ్వరరావు(3) అస్వస్థతకు గురవడంతో ఇటుక బట్టీల వ్యాపారి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈశ్వరరావు మృతి చెందారు. దీంతో బాలుడి మృతదేహాన్ని అంబులెన్స్‌లో విజయనగరం జిల్లా మెంటాడ వద్ద వనిజ వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది.. వారిని వనిజ వద్ద వదిలేసి వెళ్లారు. అక్కడ నుంచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమీ లేక కుమారుడు శవాన్ని తండ్రి కొత్తయ్య భుజంపై వేసుకొని రెండు కొండలు ఎక్కి ఇంటికి చేరారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు..

Phone Tapping: రాధాకిషన్‌ రావు‌కు ఈనెల 12 వరకు రిమాండ్ పొడిగింపు


మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 10 , 2024 | 01:12 PM