Chandrababu: ఏపీ సీఎస్‌కు చంద్రబాబు ఫోన్... కారణమిదే!
ABN , Publish Date - Apr 02 , 2024 | 12:37 PM
Andhrapradesh: రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎస్‌కు టీడీపీ అధినేత ఫోన్ చేశారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. వృద్దులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాల్సిన అసవరం ఉందని తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 2: రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని (AP CS Jawahar Reddy) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎస్‌కు టీడీపీ అధినేత ఫోన్ చేశారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం (Election Commission) ఎటువంటి ఆంక్షలు పెట్టలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. వృద్దులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాల్సిన అసవరం ఉందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని వినతి చేశారు. ఎండల సమయంలో లబ్దిదారులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత వివరించారు. సచివాలయం సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేపట్టలన్నారు. ఏ ఒక్క లబ్దిదారుడికీ ఇబ్బంది లేకుండా వెంటనే పంపిణీ ప్రక్రియను చేపట్టాలని చంద్రబాబు ఫోన్‌లో తెలిపారు.
YS Sunitha.. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాతోనూ చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. పెన్షన్‌ల విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేలా ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రం ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. పెన్షన్‌ల విషయంలో వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారంపైనా చర్యలు తీసుకోవాలి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వినతి చేశారు.
ఇవి కూడా చదవండి...
Viral Video: చెమటలు పట్టించిన చిరుత.. ఇళ్ల పై కప్పు నుంచి దూకుతూ.. వీడియో వైరల్..
Siddaramaiah: నేను సీఎంగా ఉండాలంటే.. వరుణలో 60వేల మెజారిటీ రావాలి
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..