AP Elections: తిరగబడుతున్న ఓటర్లు.. ఆ నేతల్లో టెన్షన్..
ABN, Publish Date - May 02 , 2024 | 09:03 AM
ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.
ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి.
ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. ఐదేళ్లలో నువ్వు మాకేం చేశావంటూ నాయకులను నిలదీస్తున్నారు. ఓవైపు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు.. స్థానిక పార్టీ నాయకులపై ఓటర్లు తిరగబడుతున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా మమల్ని పట్టించుకోకుండా మళ్లీ ఇప్పడు వచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో అభ్యర్థుల్లో ఓటమి భయం పట్టుకుందట. కొంతమంది ఓటర్లు అయితే ఈసారి మీకు ఓటు వేయబోమని వైసీపీ నాయకులకు నేరుగా చెబుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా సంక్షేమ పథకాలు మినహా.. మిగతా విషయాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు లేదా స్థానిక నాయకులు తమను పట్టించుకోలేదని.. ఈసారి ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి.
నవ సందేహాలకు జగన్ జవాబివ్వాలి
నాయకులపై తిరుగబాటు..
ఐదేళ్లపాటు మౌనంగా ఉన్న ఓటర్లు ఎన్నికల వేళ మౌనం వీడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం లేదన్న ధైర్యంతోనే ఓటర్లు నాయకులపై తిరుగుబాటు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల అరాచకాలు పెరిగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా వైసీపీ నాయకుల అరాచకాలపై మాట్లాడితే అక్రమ కేసుల పేరుతో వేధిస్తామని బెదిరించడంతో చాలామంది మౌనంగానే ఉండిపోయారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఓటరు మౌనం వీడి మనసులో మాట బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైందట.
కొన్నిచోట్ల ఘర్షణలు..
తాము ఈసారి వైసీపీకి ఓటు వేయబోమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో ఓ గ్రామంలో ఓటర్లు చెప్పగా.. ఆ ఇంటిపక్కనే ఉన్న వైసీపీ నాయకుడు ఎందుకు నువ్వు ఓటు వేయనంటున్నావంటూ గొడవకు వెళ్లడంతో.. అక్కడి ఓటర్లు ఎదురుతిరిగినట్లు తెలుస్తోంది. ఐదేళ్లు మీరు మాకు ఏం చేశారు. మీ సెటిల్‌మెంట్లు మీరు చేసుకున్నారు తప్పా.. ప్రజలకు ఏం చేయలేదని తిరగబడ్డారట. మీకు మేం ఓటు వేసేది లేదని మొఖం మీద చెప్పేశారట. ఓట్లు కావాలంటే మా దగ్గరకు వస్తారు.. లేకుండా మమల్ని పట్టించుకోరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇలాంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉంటే వైసీపీ నాయకులు మాత్రం ప్రజలంతా మావైపే ఉన్నారంటూ ప్రచారం చేసుకోవడం కొంత విచిత్రంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి.. ప్రజలు ఏ పార్టీని ఆదిరిస్తారనేది మరో నెల రోజుల్లో తేలిపోనుంది.
అది.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read Latest AP News and Telugu News
Updated Date - May 02 , 2024 | 09:03 AM