Share News

Balineni Srinivasa Reddy: పవన్‌తో నేడు బాలినేని భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

ABN , Publish Date - Sep 19 , 2024 | 09:32 AM

నిన్న (బుధవారం) వైసీపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ పొలిటీషియన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇవాళ (గురువారం) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. జనసేనలో చేరికపై కీలక మంతనాలు జరపనున్నారు. అయితే జనసేనలో చేరేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఒకవేళ అనుమతి ఇస్తే ఆయన చేరిక ఎప్పుడు?

Balineni Srinivasa Reddy: పవన్‌తో నేడు బాలినేని భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

అమరావతి: నిన్న (బుధవారం) వైసీపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ పొలిటీషియన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇవాళ (గురువారం) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. జనసేనలో చేరికపై కీలక మంతనాలు జరపనున్నారు. అయితే జనసేనలో చేరేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఒకవేళ అనుమతి ఇస్తే ఆయన చేరిక ఎప్పుడు?, జనసేన జెండాను ఎప్పుడు కప్పుకుంటారు? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపేందుకు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇవాళ వెళ్లనున్నారు. చర్చల అనంతరం ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. బాలినేని చేయనున్న ప్రకటనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. జనసేనలో చేరికపై సంకేతాలు వచ్చినప్పటికీ పవన్‌తో భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన ఉంటుందనే ఆసక్తికరంగా మారింది.


బాలినేని అలా దూరమయ్యారు..

కాగా ఓటమి తర్వాత బలహీన పడిపోయిన వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలతో సహా పలువురు ముఖ్య నాయకులు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్‌ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీ కేడర్‌లో కలవరం మొదలైంది. జగన్‌కు వరుసకు బాబాయి అయిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాస రెడ్డి బావమరిది. దగ్గరి బంధుత్వం కావటంతో జగన్‌తో అవినాభావ సంబంధాల కారణంగా చాలాకాలం ఆ పార్టీలో పనిచేశారు. జగన్‌ సర్కారులో మొదటి రెండున్నర సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయనను జగన్‌ తప్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగిస్తూ తనను పదవి నుంచి తప్పించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Sep 19 , 2024 | 09:33 AM