Share News

కడదాకా మీకు తోడుగా ఉంటా..

ABN , Publish Date - May 15 , 2024 | 01:23 AM

మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా.. కడదాకా మీతోనే ఉంటా.. ఎవరూ అధైర్యపడొద్దు అంటూ మాచర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి హామీనిచ్చారు.

కడదాకా మీకు తోడుగా ఉంటా..

రెంటచింతల, మే 14: మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా.. కడదాకా మీతోనే ఉంటా.. ఎవరూ అధైర్యపడొద్దు అంటూ మాచర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి హామీనిచ్చారు. ఎన్నికల సందర్భంగా గాయపడ్డ రెంటాల గ్రామ టీడీపీ నేతలైన గొంటు నాగమల్లేశ్వరరెడ్డితో పాటు ఇతరులను పిడుగురాళ్ల ఆస్పత్రిలో మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లను కోరారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు అబ్బిరెడ్డి, మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు సుమంత్‌రెడ్డి, మాజీ డీసీ చైర్మన్‌ నల్లబిరుదు నరశింహారావు, బోడపాటి రామకృష్ణ, శౌర్రెడ్డి, రాయపరెడ్డి, గోగుల వెంకట్రామిరెడ్డి, ఆదూరి శివ తదితరులున్నారు.

అలాగే పోలింగ్‌లో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడి నరసరావుపేటలో చికిత్స పొందుతున్న ఆదూరి అలైక్య, భవాని ప్రసాద్‌, మల్లెల గోపి, గుంటూరులో చికిత్స పొందుతున్న ఫిరోజ్‌, షాజన, షేక్‌ నయానా, తురకా నాగార్జున రమావత ప్రవీణ్‌లను బ్రహ్మారెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దని అండగా ఉంటా నని భరోసానిచ్చారు.

Updated Date - May 15 , 2024 | 08:13 AM