Share News

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Dec 28 , 2024 | 09:52 PM

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని మంత్రి నారాయణ అన్నారు.

Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు
Minister Narayana

విజయవాడ: మూడు రాజధానుల‌ పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడారని మంత్రి నారాయణ ఆరోపించారు. ఇవాళ(శనివారం) నెరెడ్కో ఆధ్వర్యంలో 2025 డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, నెరెడ్కో‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... గత ఐదేళ్లల్లో రియల్ ఎస్టేట్ ఏమైందో అందరూ చూశారని అన్నారు. ఎక్కడైనా రియల్‌ ఎస్టేట్‌ డెవలప్ అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాను ఇక్కడ పరిస్థితులు తెలుసుకుని టౌన్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని అన్నారు. నెరెడ్కో ప్రతినిధులు కూడా తనను కలిసి పరిస్థితి వివరించారన్నారు. నూతన విధానాలను ఈనెల 30లేదా 31 విడుదల చేస్తామని ప్రకటించారు. సెల్లార్ నిర్మాణంలో ఉన్న ఇబ్బందులు పరిష్కరిస్తామని తెలిపారు.


మీరు చెప్పిన ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకున్నామన్నారు. 2014లో ఆన్‌లైన్‌లో అనుమతి ఇచ్చే విధానం మనమే అమలు చేశామన్నారు. సింగిల్ విండో‌ విధానం కూడా అమలు చేస్తామని చెప్పారు. టౌన్ ప్లానింగ్ వాళ్ల నుంచి కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయన్నారు. వారి వైపు ఉన్న సమస్యలు పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారులు కొర్రీ పెడుతూ అనుమతులు ఆపుతున్నారన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత తాను అనుమతి ఇప్పించానని గుర్తుచేశారు. ఆన్‌లైన్ విధానంలో సాప్ట్ వేర్ అప్ డేట్ చేయాలని గుర్తించామన్నారు. ఫిబ్రవరి నాటికి ఈ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు.అన్ని డిపార్ట్మెంట్ అనుమతులు ఆన్ లైన్‌లో వచ్చేలా చేస్తామన్నారు. అమరావతి రాజధానిగా నిర్మాణం చేయకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధి పనులను నిరుపయోగంగా చేశారన్నారు. జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. ఒకేసారి రాజధానిలో రూ. 60 వేల‌కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అధికారిక భవనాలు, టవర్స్ నిర్మాణం, విశాలమైన రోడ్లు నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఏడాదిలోగా రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా రాష్ట్రం కూడా అన్ని విధాలా వృద్ధి చెందుతుందని చెప్పారు.మీరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారాయణ కోరారు.


అన్ని విధాలా అమరావతి అభివృద్ధి: ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని

kesineni-chinni-tdp.jpg

అమరావతి రాజధానిగా అన్ని విధాలా అభివృద్ధి చెందబోతుందని ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని తెలిపారు. చంద్రబాబు సారధ్యంలో ఏపీ కొత్తగా ఆవిష్కృతం అవుతుందని తెలిపారు.జనవరి 20 నుంచి రాజధానిలో పనులు పరుగులు పెట్టడం ఖాయమన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి కూడా పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. NAC సెంటర్‌ను విజయవాడ సెంట్రల్లో నెలకొల్పాలని చెప్పారు.అమరావతిలో పనులు మొదలైతే బిల్డర్లకు వర్కర్ల కొరత ఉంటుందని అన్నారు. ప్రతి భవన నిర్మాణ కార్మికునికి శిక్షణ ఇచ్చేలా చూడాలన్నారు. హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా తప్పకుండా NAC అభివృద్ధి చెందుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నవ్యాంధ్ర నిర్మాణం పూర్తి అవుతుందని ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని తెలిపారు.


రియల్ ఎస్టేట్ రంగం 2025 నుంచి ఊపందుకుంటుంది: ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు

Bonda.jpg

రియల్ ఎస్టేట్ రంగం 2025 నుంచి ఊపందుకుంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం లో అమరావతి నుంచి హైదరాబాద్‌కు అందరూ వలస వెళ్లారన్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో అందరూ అమరావతి వైపు చూస్తున్నారని అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధితో ఈ‌ప్రాంతం రూపు రేఖలు మారడం ఖాయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.


అమరావతిలో రూ. 40వేల కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

yarlagadda-venkat-rao.jpg

అమరావతిలో రూ. 40వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగబోతున్నాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. పతనం అంచు నుంచి మళ్లీ మనం పయనం ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతుందని చెప్పారు. అమరావతి అభివృద్ధిలో నెరెడ్కో భాగస్వామ్యం కావాలని కోరారు. మంచి నిర్మాణాల ద్వారా ప్రజల ఆదరణ పొందాలన్నారు. అందరం క‌లిసి రాష్ట్ర అభివృద్ధికి నడుం కట్టాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం

Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం

Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 28 , 2024 | 09:52 PM