Share News

Jr NTR: నేడు ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్

ABN , Publish Date - Sep 13 , 2024 | 08:39 AM

నేడు ఏపీ సచివాలయానికి స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రానున్నారు. ఉదయం 11 గంటల తరువాత వీరిద్దరూ సచివాలయానికి రానున్నారు.

Jr NTR: నేడు ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్

అమరావతి: నేడు ఏపీ సచివాలయానికి స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రానున్నారు. ఉదయం 11 గంటల తరువాత వీరిద్దరూ సచివాలయానికి రానున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న విజయవాడలోని ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు పిలుపుమేరకు సీఎంఆర్ఎఫ్‌కు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు సాయం అందించనున్నారు. ఇటీవల వరద సాయం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలకు 50 లక్షలు చొప్పున అందిస్తానని ట్విట్టర్ వేదిగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ విరాళం అందించేందుకు నేడు ఏపీ సచివాలయానికి రానున్నారు.


‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయ పడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరొక రూ.50 లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అని రామ్ చరణ్ తెలిపారు.


‘‘వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నావంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఇక వీరిద్దరూ ప్రకటించిన విధంగానే నేడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు.

Updated Date - Sep 13 , 2024 | 08:39 AM