Share News

పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తాం

ABN , Publish Date - Oct 06 , 2024 | 04:06 AM

మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందేలా చూస్తామని, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు చెప్పారు.

పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తాం

  • బాధ్యతలు స్వీకరించిన మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బంగార్రాజు

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందేలా చూస్తామని, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన ఆయన శనివారం విజయవాడలోని మార్క్‌ఫెడ్‌ ప్రధాన కార్యాలయంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రమాణస్వీకారం చేసి, చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బంగారురాజు మాట్లాడుతూ పసుపు, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పప్పు ధాన్యాలకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్లుగా అన్నెపు రామకృష్ణనాయుడు, పరసా వెంకటరత్నం, కేసీ హరి, వంగల శశిభూషణ్‌, జీబీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేశారు. మార్క్‌ఫెడ్‌ ఎండీ మనజీర్‌ జిలానీ సమూన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌, నెల్లిమర్ల టీడీపీ నాయకులు హాజరై, బంగారురాజుకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Oct 06 , 2024 | 04:06 AM