YS Sharmila: ఏపీ దశ దిశ మారాలంటే తక్షణం కావాల్సింది అదే
ABN , Publish Date - Dec 14 , 2024 | 10:15 AM
Andhraradesh: రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారని.. పూర్తిగా అటకెక్కించారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో అనాడు యూపీఏ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందన్నారు.
విజయవాడ , డిసెంబర్ 14: స్వర్ణాంధ్ర విజన్ - 2047 పేరుతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదని.. విభజన హామీలన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు అని అన్నారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారని.. పూర్తిగా అటకెక్కించారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో అనాడు యూపీఏ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందన్నారు.
ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్
ఒక్క హామీకి దిక్కులేదు...
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని.. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించిందని గుర్తుచేశారు. బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13 లో పొందపరించిందని వెల్లడించారు. అలాగే కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామని విభజన చట్టంలో పొందపరించిందన్నారు. నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయన్నారు. ఇవ్వాళ్టికి ఒక్క హామీకి దిక్కులేకుండా పోయిందని వ్యాఖ్యలు చేశారు.
విభజన హామీలు నెరవేరి ఉంటే..
గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవన్నారు. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవని... లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని తెలిపారు. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది ఉంటే పేదరిక నిర్మూలన సాధ్యం అయ్యేదన్నారు. విభజన హామీలు అమలు అయ్యి ఉంటే రాష్ట్రం దిశ - దశ పూర్తిగా మారేదన్నారు. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేదని చెప్పారు. విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోడీ అయితే, రెండో ముద్దాయి చంద్రబాబు .. మూడో ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
రాష్ట్రానికి తీరని ద్రోహం...
ముగ్గురు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోడీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు చెవుల్లో పూలు పెట్టారంటూ వ్యాఖ్యలు చేశారు. 25 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే అని.. హోదాతోనే రాష్ట్రానికి విజన్ అని చెప్పుకొచ్చారు. ‘‘మోడీ పిలక మీ చేతుల్లో ఉంది. విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండి’’ అంటూ వైఎస్ షర్మిల్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు
మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..
Read Latest AP News And Telugu News