వర్గీకరణపై కమిషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:42 AM
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
గడువు కంటే ముందుగానే నివేదిక ఇవ్వాలి: మంద కృష్ణ మాదిగ
గుంటూరు తూర్పు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణకు సీఎం చంద్రబాబు తొలి నుంచి మద్దతు తెలుపుతూ అండగా నిలబడ్డారని చెప్పారు. కృష్ణ మాదిగ గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు ప్రభుత్వం 60 రోజుల గడువు ఇచ్చిందని, అయితే నెల రోజుల్లోపే నివేదిక ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. ‘‘ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. వర్గీకరణతో నోటిఫికేషన్లు ముడిపడి ఉన్నందున నివేదిక త్వరగా వచ్చేలా ప్రభుత్వం చూడాలి’ అని కోరారు.