NDA Leaders: ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడి... 50 వేల కోట్ల పైమాటే...
ABN , Publish Date - Apr 22 , 2024 | 01:45 PM
Telangana: ఏపీలో బియ్యం మాఫియాపై ఎన్టీఏ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడి... 50 వేల కోట్ల పైమాటే అని ఎన్డీఏ నేతలు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, లంకా దినకర్, శివ శంకర్‌లు వ్యాఖ్యలు చేశారు. సోమవారం కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి.. ఆయన అనుచరులు పేదల పొట్ట కొట్టారని ఆరోపించారు. భాస్కర్ రెడ్డి, ద్వారంపూడిలతో వ్యవహారం... కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి అయ్యిందన్నారు.
అమరావతి, ఏప్రిల్ 22: ఏపీలో (Andhrapradesh) బియ్యం మాఫియాపై ఎన్టీఏ నేతలు (NDA Leaders)తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడి... 50 వేల కోట్ల పైమాటే అని ఎన్డీఏ నేతలు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, లంకా దినకర్, శివ శంకర్‌లు వ్యాఖ్యలు చేశారు. సోమవారం కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి.. ఆయన అనుచరులు పేదల పొట్ట కొట్టారని ఆరోపించారు. భాస్కర్ రెడ్డి, ద్వారంపూడిలతో వ్యవహారం... కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి అయ్యిందన్నారు. మిల్లర్లతో కుమ్మక్కు.. సంచులు పేరుతో వైసీపీ అనుంగ కంపెనీకి రూ.750 కోట్ల వరకు దోచి పెట్టారన్నారు.
AP SSC Results: షాకింగ్.. ఏపీలో ఒక్కరూ పాస్ కాని స్కూళ్లు ఎన్నంటే..!?
బియ్యం అవినీతి విలువ అక్షరాల అనధికారికంగా లక్ష కొట్లు అని తెలిపారు. టీడీపీ హయాంలో 50 శాతం సబ్సీడీతో పేదలకు సరుకులు పంపిణీ చేశామని, పండుగలకు 18 రకాల సరుకులు పంపిణీ చేశామని వెల్లడించారు. టీడీపీ హాయంలో ఇచ్చిన సరుకులన్నింటికి వైసీపీ కుచ్చుటోపి పెట్టిందని మండిపడ్డారు. ఇచ్చిన ఒకటి రెండు సరకుల ధరను పెంచి జగన్ ... పేదల పొట్ట కొట్టారని విరుచుకుపడ్డారు. సన్నబియ్యం కాదు కదా... కేంద్రం ఇచ్చే దాన్ని దోచుకుని పేదలకు పండుగలను దూరం చేశారు జగన్ రెడ్డి.. ఆయన తొత్తులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Aadhaar Card: ఫ్రీగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకున్నారా.. లేదంటే మీకే నష్టం
కేంద్రం ఇచ్చిన నిధులు సరిపోవంటూ.. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం అప్పులు చేసి మరో రూ.30 వేల కోట్ల నిధులను వైసీపీ నేతలు మింగేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జే గ్యాంగ్ అవినితిపై విచారణ జరిపిస్తామన్నారు. అవినీతి పాలనకు చరమగీతం పాడి... అవినీతి చేపలను జైలుకు పంపడం ఖాయమని కూటమి నేతలు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, లంకా దినకర్, శివ శంకర్ స్పష్టం చేశారు.