Share News

AP News: ఆగ‌స్ట్ 15 నుంచి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప‌రీక్షలు

ABN , Publish Date - Aug 09 , 2024 | 08:49 PM

ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన ఎంతో అవసరమని రాష్ట్ర పురపాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. 15 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించ‌నున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

AP News: ఆగ‌స్ట్ 15 నుంచి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప‌రీక్షలు

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఆగ‌స్ట్ 15వ‌తేదీ నుంచి ఉచితంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయ‌ణ (Narayana) తెలిపారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్‌ను నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన ఎంతో అవసరమని చెప్పారు. 15 ఆగస్టు 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించ‌నున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వంతో పాటు రాష్ట్రస్థాయిలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. వాల్‌పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జి. కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ సూర్యతేజ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2024 | 08:50 PM