తాగునీటికి కటకట
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:37 PM
మండలంలోని ఐనేకల్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో దాదాపు 2వేల మంది ఉన్నారు. గ్రామంలోని తాగునీటి పథకాలు పనిచేయడం లేదు.

ఆస్పరి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఐనేకల్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో దాదాపు 2వేల మంది ఉన్నారు. గ్రామంలోని తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. దీంతో గ్రామస్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిథులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో యాటకల్లు గ్రామ సమీపంలోని వంకలోని బోరుకు పైపులైన్ వేసి ఐనేకల్లు శివార్లలో నీరు వస్తోంది. దీంతో అక్కడకు పోయి వద్దకు పోయి నీరు తెచ్చుకుంటున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి సమస్య తీర్చాలని తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.