Minister Narayana: ఏపీలో భవన నిర్మాణాలకు నూతన విధానం.. వివరాలు ఇవే..
ABN , Publish Date - Nov 10 , 2024 | 08:21 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఏపీ పట్టణ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఏపీ పట్టణ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో ఇకపై లైసెన్స్‌డ్ సర్వేయర్లు లేదా ఇంజినీర్ల ప్లాన్ ప్రకారమే భవనాలు నిర్మించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు నెల్లూరులో రాష్ట్ర పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Pawan Kalyan: ఆ విషయంలో చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన పవన్ కల్యాణ్..
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. "ఏపీలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతుల కోసం కొత్త విధానాన్ని తీసుకువస్తున్నాం. లైసెన్స్‌డ్ సర్వేయర్ లేదా ఇంజినీర్లు ప్లాన్ సమర్పిస్తే చాలు అనుమతులు ఇస్తాం. అయితే ఆ ప్లాన్ ప్రకారమే భవనం నిర్మించాల్సి ఉంటుంది. నిర్మాణ ప్రక్రియను సంబంధిత మున్సిపల్ అధికారులు పరిశీలిస్తుంటారు. ప్లాన్ ప్రకారం నిర్మాణం లేకుంటే సంబంధిత సర్వేయర్ లేదా ఇంజినీర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. భవన నిర్మాణంలో డీవియేషన్ ఉంటే వారిద్దరిపై క్రిమినల్ కేసులు పెడతాం. ఆయా మున్సిపాలిటీలు, వివిధ శాఖలకు సంబంధించిన ఫీజులను భవన యజమానులు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
Pawan Kalyan: షర్మిల భద్రతపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఫైర్, రిజిస్ట్రేషన్, శానిటరీ సహా ఇతర శాఖల అనుమతులూ ఆన్‌లైన్ విధానంలోనే ఇస్తాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి అధ్యయనం చేశాం. దేశంలోనే మొదటిసారిగా భవన నిర్మాణ అనుమతులకు ఆన్‌లైన్ విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చింది. దీన్ని మరింత మెరుగుపరిచేందుకే కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నాం. వివిధ శాఖల సాఫ్ట్‌వేర్లు మున్సిపల్ శాఖతో అనుసంధానమైన తర్వాత నూతన విధానం అమలు చేస్తాం. వచ్చే నెల లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించాల్సి ఉంది" అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఆ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు..
Srisailam: శ్రీశైలం ఆలయానికి వివాదాల అఘోరీ.. విషయం ఏంటంటే..