Share News

AP Election 2024: అయ్యో.. వివేకా!.. ‘మంచి పిల్లోడు’ అంటూ కితాబు

ABN , Publish Date - May 04 , 2024 | 03:26 AM

రాయలసీమలో ఒకప్పటిలా ఫ్యాక్షన్‌ గొడవలు, ప్రతీకార చర్యలు ఇప్పుడు లేవు. కానీ ఓ కుటుంబంలో ఎవరికైనా హా ని జరిగితే న్యాయం కోసం అంతా కలసికట్టుగా పోరాడుతా రు.

AP Election 2024: అయ్యో.. వివేకా!.. ‘మంచి పిల్లోడు’ అంటూ కితాబు

  • రక్తసంబంధీకులకే పట్టని ‘న్యాయం’.. నిందితులకే పలువురి వత్తాసు

  • అవినాశ్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చిన జగన్‌.. ‘మంచి పిల్లోడు’ అంటూ కితాబు

  • సోదరుల వారసులూ అటే.. ఒంటరిగా సునీత పోరాటం.. షర్మిల అండ

  • కొంగుచాపి న్యాయం కోసం వేడుకోలు.. అండగా నిలవని కుటుంబం

(కడప-ఆంధ్రజ్యోతి)

రాయలసీమలో ఒకప్పటిలా ఫ్యాక్షన్‌ గొడవలు, ప్రతీకార చర్యలు ఇప్పుడు లేవు. కానీ ఓ కుటుంబంలో ఎవరికైనా హా ని జరిగితే న్యాయం కోసం అంతా కలసికట్టుగా పోరాడుతా రు. కేసులు, కోర్టుల వ్యవహారంలో సాయంగా ఉంటారు. అయితే మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, ప్రస్తు త సీఎం జగన్‌ బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో వైఎస్‌ ఫ్యామిలీ నిలువునా చీలిపోయింది. వివేకా రక్తం పంచుకుని పుట్టిన సోదరులు, సోదరితో పాటు వారి వారసులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పైగా చాలామంది వివేకా హత్య కేసులో నిందితులకు మద్దతుగా ఉంటున్నారు. న్యాయం కోసం కేవలం వివే కా కుమార్తె సునీత పోరాడుతుండగా, వైఎస్‌ కుమార్తె షర్మిల ఆమెకు అండగా ఉంటున్నారు. రాజకీయంగా ఎంతో పేరున్న వైఎస్‌ కుటుంబం నేడు రోడ్డున పడింది. పులివెందుల అంటే వెంటనే వైఎస్‌ కుటుంబం గుర్తుకొస్తుంది. ఆ కుటుంబానికి అంతటి పేరు రావడానికి రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డిలే కారణం. వైఎస్‌ రాజారెడ్డికి జార్జిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డి, విమలమ్మ సంతా నం. రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించగా, వివేకా హత్యకు గురయ్యారు. వీరిద్దరూ బతికున్న రోజుల్లో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అలాగే తమ సోదరి విమలమ్మను ఆప్యాయంగా చూసేవారు.


వైఎస్‌ కుటుంబ వ్యవహారాలను వివేకా చక్కబెట్టేవారు. వారి ద్వారా ఇతర కుటుంబ సభ్యులు ఆర్థికంగా లబ్ధిపొందారని చెబుతుంటారు. అలాంటి ది.. వివేకా తమ కంచుకోట అయిన పులివెందులలో, సొంత ఇంట్లో దారుణహత్యకు గురైతే.. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం స్థానికులకు, వైఎస్‌ అభిమానులకు విస్మయం కలిగిస్తోంది. ఈ కేసులో న్యాయం చేయాలంటూ సునీత, షర్మిల మాత్రమే పోరాడుతున్నారు. వీరికి మిగతా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లేదు. సీఎం జగన్‌ తన బాబాయ్‌ హత్య కేసులో నిందితులకే వత్తాసు పలుకుతున్నా రు. వివేకా సోదరుడు జార్జిరెడ్డి కొడుకులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, మరో సోదరుడు రవీంద్రనాఽథరెడ్డి ఇద్దరు కొడుకులు.. జగన్‌ అండ్‌ కోతో ఉన్నారు. ఇక విమలమ్మ ఈ కేసు విషయంలో తన మేనకోడళ్లు షర్మిల, సునీతనే విమర్శిస్తున్నారు.


నిందితులకే జగన్‌ అండ

బాబాయ్‌ వివేకా హత్యకు గురైతే నిందితులకు శిక్షపడేలా చేయాల్సిన సీఎం జగన్‌ వారికే అండగా ఉంటున్నారు. గత ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ సొంత రోత పత్రికలో రాయించిన జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక వివేకా కేసులో సీబీఐ నిందితులుగా చేర్చిన కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని వెనకేసుకొస్తున్నారు. పైగా ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న చెల్లెళ్లపై అభాండాలు వేస్తున్నారు. ‘‘అవినాశ్‌రెడ్డి చిన్నపిల్లోడు. అమాయకుడు.. ఆయన పొలిటికల్‌ జీవితం నాశ నం చేసేందుకు కుట్రపన్నుతున్నారు’’ అని పులివెందులలో జగన్‌ చెప్పుకొచ్చారు. అవినాశ్‌రెడ్డికే మళ్లీ కడప ఎంపీ టికెట్‌ ఇవ్వడం, జిల్లాలోని ప్రతి సభలోనూ ‘నా తమ్ముడు, పసిపిల్లోడు మంచిపిల్లోడు’ అంటూ అవినాశ్‌ను వెనకేసుకు రావ డం వైసీపీ కేడర్‌కే నచ్చడంలేదు. అంతేగాక వివేకా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా రెండో పెళ్లి ప్రస్తావన తెస్తున్నారు.


ఆడబిడ్డల పోరాటం

వివేకా కేసులో న్యాయం కోసం ఆడబిడ్డలు సునీత, షర్మిల రోడ్డెక్కి ఊరూరా తిరుగుతున్నారు. వీరిని చూసి పార్టీలకతీతంగా అయ్యో రాజన్న, వివేకమన్న బిడ్డలకు ఎంత కష్టమొచ్చిందంటూ బాధపడుతున్నారు. ‘వివేకా కేసులో నిందితుల కు శిక్ష పడడం కోసం కొంగుచాపి అడుగుతున్నాం.. న్యాయం చేయండి’ అంటూ వారు అడుగుతున్న తీరు సామాన్యులను కలిచివేస్తోంది.

నిందితులు.. భారతికి దగ్గర

వివేకా హత్య కేసులో సీబీఐ అభియోగాలు మోపిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి... వీరిద్ద రూ జగన్‌ సతీమణి భారతికి దగ్గరి బంధువులు. భాస్కర్‌రెడ్డి స్వయానా భారతికి మేనమామ. వివేకాకు దాయాది అవుతారు. వివేకా, జగన్‌కు సొంత బాబాయ్‌ . సీఎం జగన్‌ తన సతీమణి భారతి చెప్పినట్టు వింటారనే ఆరోపణలున్నాయి.

Updated Date - May 04 , 2024 | 08:37 AM