Share News

ప్రణతి కంచు మోత

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:00 AM

భారత జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. టర్కీలోని అంటాల్యాలో శనివారం జరిగిన వరల్డ్‌కప్‌ వాల్ట్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో కాంస్య పతకం...

ప్రణతి కంచు మోత

జిమ్నాస్టిక్స్‌ వరల్డ్‌కప్‌ వాల్ట్‌ ఫైనల్స్‌లో పతకం

న్యూఢిల్లీ: భారత జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. టర్కీలోని అంటాల్యాలో శనివారం జరిగిన వరల్డ్‌కప్‌ వాల్ట్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో కాంస్య పతకం సాధించింది. వాల్ట్‌ ఫైనల్స్‌లో ప్రణతి మొత్తం 13.417 పాయింట్లు స్కోరు చేసి మూడోస్థానంలో నిలిచింది. అమెరికా జిమ్నా్‌స్టలు జేలా హాంగ్‌ (13.667)కు స్వర్ణం, క్లెయిర్‌ పీస్‌ (13.567)కు రజతం దక్కాయి. కోల్‌కతాకు చెందిన 29 ఏళ్ల ప్రణతికి ఇది ప్రపంచకప్‌లో రెండో పతకం. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు ఈజిప్టులో జరిగిన వరల్డ్‌క్‌పలోనూ వాల్ట్‌ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గింది. ఇక, 2019, 2022 ఆసియా చాంపియన్‌షి్‌ప్సలోనూ ప్రణతి కాంస్య పతకాలు కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 04:00 AM