Share News

TDP Raa Kadali at Gudiwada Live Updates: గుడివాడలో మొదలైన టీడీపీ రా.. కదలి రా బహిరంగ సభ..

ABN , First Publish Date - Jan 18 , 2024 | 04:06 PM

‘రా కదలిరా’ పేరుతో గుడివాడలో తెలుగుదేశం పార్టీ (TDP) నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ మొదలైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న ఈ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విచ్చేశాయి.

TDP Raa Kadali at Gudiwada Live Updates: గుడివాడలో మొదలైన టీడీపీ రా.. కదలి రా బహిరంగ సభ..

Live News & Update

  • 2024-01-18T16:05:13+05:30

    ‘రా కదలిరా’ పేరుతో గుడివాడలో తెలుగుదేశం పార్టీ (TDP) నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ షురూ అయ్యింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి ప్రసంగించనున్న ఈ సభకు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి. ఉదయం నుంచి గుడివాడలో పోలీసుల ఆంక్షల మధ్య ‘రా కదలి రా’ బహిరంగ జరుగుతోంది. టీడీపీ శ్రేణుల వాహనాలను బైపాస్ రహదారుల మీదుగా దారి మళ్లించారు. నెహ్రూ చౌక్ సెంటర్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో తెలుగుదేశం జెండాలు, బ్యానర్లు కట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ బహిరంగ సభ నేపథ్యంలో ముఖ్యమైన కూడళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. దీంతో ఉద్రిక్తతల మధ్య ఈ బహిరంగ సభ జరుగుతోంది.

    ఉద్రిక్తల నడుమ సభ..

    మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఉదయం బైపాస్ రోడ్డులో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టగా పోలీసులు బారీకేడ్లను అడ్డంగా పెట్టారు. అయితే నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ వెనిగళ్ల రామ్మోహన్‌ నాయకత్వంలో టీడీపీ, జనసేన శ్రేణలు బారీకేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో దూసుకువెళ్లారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణం నుంచి కొడాలి నాని వేరొక చోటుకి వెళ్లిపోయారు. వైసీపీ శ్రేణులు కూడా ఆయన వెంట వెళ్లిపోయారు.