Share News

Venkaiah Naidu: అప్పుడు విశాఖపట్నం జైల్‌లో ఉన్నా.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 08 , 2024 | 08:40 PM

విశాఖపట్నం అందమైన నగరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఆహార అలవాట్లు, జీవన విధానం , ఒత్తిడితో డయాబెటిస్ బారిన పడుతున్న వారు పెరుగుతున్నారని చెప్పారు. ప్రజల జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.

Venkaiah Naidu: అప్పుడు  విశాఖపట్నం జైల్‌లో ఉన్నా.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం: ఎమర్జెన్సీ సమయంలో విశాఖపట్నం జైల్‌లో ఉన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఇసికాన్ 2024 పేరుతో ఎండ్రోక్రినాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా 53వ జాతీయ సదస్సు ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలో జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ ఎస్ఐ ఎండ్రోక్రినాలజీ టెస్ట్ బుక్‌ను విడుదల చేశారు.


ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.... విశాఖపట్నం అందమైన నగరమని తెలిపారు. ఆహారపు అలవాట్లు, జీవన విధానం , ఒత్తిడితో డయాబెటిస్ బారిన పడుతున్న వారు పెరుగుతున్నారని చెప్పారు. ప్రజల జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కువ శాతం మంది డయాబెటిస్, థైరాయిడ్‌తో బాధపడుతున్నారని వెంకయ్య నాయుడు అన్నారు.


వైద్యులు రోగులకు ముందులపై అవగాహన కల్పించిన తర్వాత వైద్యం చేయాలని చెప్పారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యులు అవసరం లేకపోయినా ఎక్కువ టెస్టులు రాస్తున్నారనే అపవాదు ఉందని.. ఈ విధానం మారాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద ప్రజలకు వైద్యులు మెరుగైన వైద్య సేవలందించాలని చెప్పారు. సానుకూల వైఖరితో వైద్యులు ముందుకు వెళ్లాలని అన్నారు. ఎక్కువగా మొబైల్ ఫోన్ వినియోగంతో క్రియేటివ్ నాలెడ్జ్‌ను కోల్పోతామని వెంకయ్య నాయుడు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Chennai: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రాకెట్‌ లాంఛర్‌ లభ్యం

KA Paul: సుప్రీంకోర్టులో కేఏపాల్‌కు చుక్కెదురు

YCP Kethi Reddy: ప్యాలెస్‌ను ఖాళీ చేయండి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫామ్ హౌస్‌కు నోటీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 08:44 PM