CM Ramesh: పరవాడ ఫార్మా సెజ్‌లో ఘటన దురదృష్టకరం
ABN , Publish Date - Aug 23 , 2024 | 01:40 PM
Andhrapradesh: పరవాడ సినర్జిన్ ఫార్మాలో జరిగిన ఘటన దురదృష్టకరమని .. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్ లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు...
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 23: పరవాడ సినర్జిన్ ఫార్మాలో జరిగిన ఘటన దురదృష్టకరమని .. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (MP CM Ramesh) అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్ లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) గంట గంటకు ఈ ఘటనపై మానిటరింగ్ చేస్తున్నారన్నారు. రాత్రి 12 గంటల 30 నిమిషాలకు జరిగిందని తెలిపారు.
Rain: ఈ వర్షాన్ని చూస్తే.. ‘వాహ్ క్యా రేన్ హే’ అనకుండా ఉండరు మరి!
గాయపడిన వారిని యాజమాన్యం సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని.. వారిలో ముగ్గురు జార్ఖండ్ రాష్ట్రానికి, ఒకరు విజయనగరానికి చెందినవారు ఉన్నారన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, ముంబైకి కూడా తరలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మానవ తప్పిదమే అని తెలుస్తోందన్నారు. కొన్ని రోజులు తాత్కాలిక ప్లాంట్ ఆఫ్ చేసి భద్రత ప్రమాణాలు పెంచాలని ఫార్మా కంపెనీలు కోరుతున్నారన్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాద ఘటనలను మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో సహా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad: విదేశీ మహిళలతో వ్యభిచారం..
కాగా.. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అనకాపల్లి వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థలో ప్రమాదం జరిగింది. నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పరవాడ ఫార్మా సెజ్‌ల జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై సైతం చంద్రబాబు ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను చంద్రబాబు ఆదేశించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. అటు.. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా.. అనేక మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో నెల క్రితం ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారు సైతం ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
SEBI: అనిల్ అంబానీ షేర్ మార్కెట్ నుంచి 5 ఏళ్లు నిషేధం.. రూ. 25 కోట్ల జరిమానా
Rain: ఈ వర్షాన్ని చూస్తే.. ‘వాహ్ క్యా రేన్ హే’ అనకుండా ఉండరు మరి!
Read Latest AP News And Telugu News