Share News

TDP: టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత.. చంద్రబాబు విచారం

ABN , Publish Date - Nov 05 , 2024 | 09:59 AM

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ(99) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇవాళ(మంగళవారం) ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలోని తన స్వగ్రామం పెదగోగాడలో సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు.

TDP: టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత.. చంద్రబాబు విచారం

అనకాపల్లి జిల్లా: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ(99) (Former minister Reddy Satyanarayana) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇవాళ(మంగళవారం) ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని తన స్వగ్రామం పెదగోగాడలో సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. 1983 నుంచి 1985, 1989, 1994, 1999 వరకు వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సత్యనారాయణ గెలిచారు. ఎన్టీఆర్‌ హయాంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా సత్యనారాయణ బాధ్యతలు నిర్వర్తించారు.


అలాగే టీటీడీ బోర్డు మెంబర్‌గా సేవలు అందించారు. రెడ్డి సత్యనారాయణ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి చేపట్టినప్పటికి చాలా నిరాడంబరంగా ఉండేవారు. కాగా ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందారనే వార్త టీడీపీ నేతలకు తెలియడంతో సత్యనారాయణ నివాసానికి వెళ్లి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజాప్రతినిధులు.. వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


సీఎం చంద్రబాబు విచారం

cm-chandrababu-naidu.jpg

నిరాడంబరుడు రెడ్డి సత్యనారాయణ మృతి బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రిగా పని చేసి పదవులకు వన్నె తెచ్చారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

Nagula chavithi: విజయవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 11:27 AM