AP Elections : ఏలూరులో ఎండలకు భయపడి సమయానికి ముందే చేరుకున్న ఓటర్లు..!
ABN , Publish Date - May 13 , 2024 | 07:18 AM
ఈ ఎండల్లో కష్టమైన పనే. అందుకే ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటే ఓటు త్వరగా వినియోగించుకుని ఇళ్ళకు తిరిగి వెళ్ళవచ్చనే ఆలోచనలో ఉన్నారు
ఓటు వేయాలనే ఉత్సాహం అందరిలో ఉన్నా, మండే ఎండలకు భయపడక తప్పడం లేదు. ఆంధ్రాలో మండుతున్న ఎండల కారణంగా పోలింగ్ కేంద్రాలకు ముందుగానే చేరుకుంటున్నారు ఓటర్లు. సూర్యుని ప్రతాపం మధ్య ఓటు వేయాలనుకునే వారికి కాస్త భయంగానే ఉంది.
వయసు మీద పడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు ఓటు వినియోగించుకోవాలంటే ఈ ఎండల్లో కష్టమైన పనే. అందుకే ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటే ఓటు త్వరగా వినియోగించుకుని ఇళ్ళకు తిరిగి వెళ్ళవచ్చనే ఆలోచనలో ఉన్నారు. ఆంధ్రా ఎలక్షన్స్ (AP Elections) కారణంగా ఏలూరు (Eluru) జిల్లాలో తాము ముందుగానే ఓటు వినియోగించుకుంటానికి వస్తున్నామని చెబుతున్నారు ఓటర్లు. ఈరోజు కాస్త ఎండ తక్కువగా ఉంటే బావుంటుందనేది. సగటు ఓటరు కోరిక.
ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది సరే. మండే ఎండ, వడదెబ్బల కారణంగా ఓటర్లు భయపడుతున్నారు. ఈరోజు కాస్త ఎండ తక్కువగా ఉంటే పోలింగ్ కేంద్రాలకు మరింత రెట్టించిన ఉత్సాహంతో వస్తారు. వడదెబ్బ తగలకుండా ముందుగానే ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది.