Share News

Chandrababu: ప్రపంచాన్ని నడిపించేది మనకి తెలియని శక్తి.. అదే లేకుంటే..

ABN , Publish Date - Jul 13 , 2024 | 11:08 AM

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి ఇవాళ ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Chandrababu: ప్రపంచాన్ని నడిపించేది మనకి తెలియని శక్తి.. అదే లేకుంటే..

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి ఇవాళ ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) వెళ్లారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 150 కోట్ల రూపాయలతో హరేకృష్ణ గోకుల క్షేత్రం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకూ 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయన్నారు. హరే కృష్ణ మూమెంట్లో 50 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారన్నారు. నమ్మిన సిద్ధాంతాలకు జీవితాలను త్యాగం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని మతాలకు వారి వారి ప్రార్థనా ఆలయాలు లేకపోతే ఇప్పుడు ఉండే జైలు కూడా చాలవన్నారు. ఇలాంటి ప్రార్థనాలయాలు లేకపోతే సమాజంలో నేరాలు-ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

నాకు ప్రాణ భిక్ష పెట్టింది ఆయనే..

‘‘ఏ పని చేసిన ముందుగా దేవుని తలుచుకుని పనులు ప్రారంభిస్తారు. ప్రపంచాన్ని నడిపించేది మనకి తెలియని శక్తి.. ఆ శక్తి దేవుని రూపంలో ఉంటుంది. ఎవరైతే ఐటిని ఎడాప్ట్ చేసుకుంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం నేను ఐటీని ప్రమోట్ చేశాను. ఏ దేశానికి వెళ్లినా భారతదేశానికి చెందిన వారుంటారు. అందులో తెలుగువారు అత్యధికంగా ఉంటారు. వేంకటేశ్వర స్వామి మా కుల దైవం. నేను నమ్మిన దేవుడు.. ప్రార్థన చేసే దేవుడు.. నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వేంకటేశ్వర స్వామే. పేదరికం లేని సమాజాన్ని దేశంలో తీసుకురావాలి జీరో పావర్టీ స్టేట్‌గా మన ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాం. అక్షయ పాత్ర ద్వారా 23 సంవత్సరాల్లో 400 కోట్ల మందికి భోజనాలు పెట్టారు.


అక్షయపాత్ర ద్వారా రోజుకు 22 లక్షల మందికి భోజనాలు అందిస్తున్నారు’’ అని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే అన్న క్యాంటీన్స్‌ని ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మంచి చేసే వారికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. భారతీయులు బాగుండాలని.. అందులో ఆంధ్రులు అగ్రస్థానంలో ఉండాలన్నారు. మీరు చేసిన మంచే మిమ్మల్ని కాపాడుతుందన్నారు. అక్కడి నుంచి చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజలనుంచి వచ్చే వినతలను స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వీకరించిన వినతులను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణను చంద్రబాబు సిద్ధం చేశారు. ప్రజల నుంచి వినతల స్వీకరించేందుకు ఇటీవల టోల్ ఫ్రీ నంబర్‌లో రిజిస్టర్ చేసుకున్న వారిని చంద్రబాబు కలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ లేనట్టే?

YS Jagan: జగన్‌పై హత్యాయత్నం కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 11:08 AM